27-09-2025 08:42:45 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): రైలు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన సోమేశ్వర్ రెడ్డి అనే దివ్యాంగుడికి వీల్ చైర్ అందించాలని మహబూబాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ రెడ్ క్రాస్ సొసైటీని కోరగా, శనివారం ఆర్సిఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగుడికి వీల్ చైర్ సమకూర్చారు. జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ, సీనియర్ సివిల్ జడ్జి శాలిని చేతులమీదుగా సోమిరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ మహబూబాబాద్ జిల్లా చైర్మన్ వరప్రసాద్, కోశాధికారి మాధవ పెద్ది వెంకటరెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ రావుల రవిచందర్ రెడ్డి, న్యాయ సలహాదారు కొండపల్లి కేశవరావు పాల్గొన్నారు.