01-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, అక్టోబర్ 31(విజయక్రాంతి): అందరూ మెచ్చేలా మరో 10 మందికి ఆదర్శనీయంగా చదవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రభుత్వం నిర్వహించే ఎప్సెట్, నీట్ ఎంట్రెన్స్ పరీక్ష లో పయనీర్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సాధించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యార్ధులకు సూచించారు.
ఎమ్మెల్యే తన సొంత నిధులతో ప్రభుత్వ బాలుర మరియు బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పయనీర్ పేరుతో ఎప్సెట్, నీట్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ఉచిత కోచింగ్ అందిస్తున్న విషయం విజేతమే అందిస్తున్న విషయం విజేతమే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట్లాడుతూ తమ భవిష్యత్తు బాగుండాలంటే అనవసర విషయాలకు దూరంగా ఉండాలని, ఎలాంటి వ్యాపకాలు చేయకుండా మంచిగా చదువుకోవాలని , ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
సంవత్సరం పాటు కష్టపడి చదివితే ఇక భవిష్యత్తు మీదే అన్నారు. పాత పరీక్ష పేపర్లతో ప్రాక్టీస్ చేయాలని, అలా చేస్తే పరీక్ష విధానం సులువుగా అర్థం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, కళాశాల ప్రిన్సిపాల్ భగవంతచారి తదితరులు పాల్గొన్నారు.