01-11-2025 12:00:00 AM
- వీటిసి లేని డ్రైవర్లు, పర్మిట్లు లేని వాహనాలు
- పెత్తనమంత ఆ..అధికారిదే, అడ్డగోలుగా అనుమతులు
- వైద్యుల పర్యవేక్షణ లేకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ
- కాగితాల్లోనే ఆ డ్రైవర్లు.. నడిపేది మరొకరు
- రోగులు లేకున్నా రోజువారి బిల్లు
- అత్యవసర సమయాల్లో కార్మికులకు తప్పని తిప్పలు
- కార్మికుల ఆరోగ్యంపై అధికారుల చిన్న చూపు
మణుగూరు, అక్టోబర్ 31,( విజయక్రాంతి) : పుడమి తల్లి ఒడిలో పని చేస్తూ నల్లబంగారాన్ని వెలికి తీసే కార్మికుల ఆరోగ్యంపై స్థానిక సింగరేణి అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఒకే కుటుంబం ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అంటూ నినా దాలను ప్రచారం చేసుకున్నప్పటికీ అవి ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. నిరంతరం శ్రమిస్తూ సింగరేణికి సిరులు కురిపిస్తున్న కార్మికుల ఆరోగ్యం సంక్షేమం ఏరియా అధికారులు పట్టింపే లేకుండా వ్యవహరిస్తున్నా రు. కార్మికుల ఆరోగ్య భద్రతపై వివక్ష ప్రదర్శిస్తున్నారు. ఏరియా ఆసుపత్రిలో అంబులె న్స్ నిర్వహణలో అత్యంత నిర్లక్ష్యం వహిస్తూ, కార్మికుల ఆరోగ్యలపై అలసత్వం వహిస్తున్నా రు. ఏరియా ఆసుపత్రిలో మార్చురీ అంబులెన్స్ వాహన సేవలు కార్మికుల్లో తీవ్ర ఆం దోళన కలిగిస్తున్నాయి. దీనిపై విజయక్రాంతి కథనం..
పేరుకే అంబులెన్స్ సేవలు..
ఏరియాలోని కార్మికుల ఆరోగ్యం కోసం లక్షలలో టెండర్ ద్వారా పొందిన మార్చురీ అంబులెన్స్ కాంట్రాక్టర్ కార్మికులకు సేవలనుఅందించడంలో విఫలం చెందారనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. కార్మిక కుటుంబాలకు ఆరోగ్యల కోసం వినియోగించాల్సిన అంబులెన్స్నునిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారు. వాహన ఫిట్నెస్ సమయంలో విటిసి ఓ పామ్ దరఖాస్తు లో తెలిపిన డ్రైవర్ లతో కాకుండా అ నుభవం లేని డ్రైవర్లతో వాహనాన్ని నడిపిస్తున్నారనే చర్చ సాగుతుంది. నిబంధనల మేరకు ముగ్గురు డ్రైవర్లు ఉండాల్సిన చోట ఇద్దరి తోనే విధులను నిర్వహిస్తు మమ అని పిస్తున్నారు. ఇదే అంబులెన్స్ కు ఫిట్నెస్ సమయంలో ఆటో వర్క్ షాప్ లో కూడా అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఓ అధికారి ఆదేశాలతో అడ్డగోలుగా అనుమతుల ను మంజూరు చేశారనే విమర్శ లు వినిపిస్తున్నాయి.
డివైసీఎంఓ ఆదేశాలు సైతం బేకాతర్..
ఏరియా ఆసుపత్రిలో కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం అంబులెన్స్ వాహనాలను ప్రతి మూడేళ్లకు ఒకసారి మార్చి టెండర్లు పిలిచి నూతన వాహనాలను ఏర్పాటు చేస్తారు. కానీ మార్చురీ అంబులెన్స్ టెండర్ మే నెలలో వర్క్ ఆర్డర్ ఇవ్వగా నాటి నుండి నేటి వరకు సంస్థ నిబంధనలను పట్టించుకోకుం డానే ఓ అధికారి అండదండలతో నెలవారి బిల్లులను డ్రా చేస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలల క్రితం అంబులెన్స్ పర్యవేక్షణను తనిఖీ చేసిన ఆస్పత్రి డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. నెలవారి బిల్లులు చెల్లిస్తు న్నా మని, మార్చురీ వాహనంగానే కాకుండా అత్యవసర సమయంతో వినియోగించేందు కు మల్టీ పర్పస్ గా ఉండాలని, ఆక్సిజన్ సిలిండర్, స్ట్రక్చర్ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని 2025 ఆగస్టు 1న కాంట్రాక్టర్ ను లేఖ ద్వారా ఆదేశించారు. కానీ ఆ వాహన యజమాని ఏమాత్రం ఈ సూచనలను పట్టించుకోకుండాసౌకర్యాల ఏర్పాటు లేకుం డా పాత పద్ధతిలో నెట్టుకొస్తున్నారు.
తప్పని ఇబ్బందులు..
కార్మికుల ఆరోగ్యం కోసం సంస్థ ఏర్పాటు చేసిన అంబులెన్స్ వాహన సేవలు కార్మి కులకు అందడం లేదనే ఆరోపణలుఉన్నాయి. ఈ వాహనాన్ని రోజువారీగా అధికా రుల పనులకు తిప్పుతూ,స్టేషనరీ, మందుల తరలింపుకు వినియోగిస్తు న్నారు. రోజువారి సేవకు కిలోమీటర్ల మేర రీడింగ్ ను చూపుతూ లక్షల్లో బిల్లులు పొందేందుకు ఓ అధికారి సహకరిస్తున్నట్లు ఉద్యోగులు, కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికుల ఆరోగ్య భద్రత పై మాత్రం ఆ ఏరియా అధికారి నిర్లక్ష్యం వహిస్తున్నారని కార్మికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సింగరేణి సీ అండ్ అండ్ ఎండి,అధికారులు స్పందించి ఏరియా ఆసుపత్రిలో అంబులెన్స్ వాహనాల నిర్వహణపై దృష్టి కేంద్రీకరించి కార్మికుల ఆరోగ్య భద్రతకు అధికారులు చర్యలు చేపట్టాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.