calender_icon.png 27 October, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

21 మంది మావోయిస్టుల లొంగుబాటు

27-10-2025 12:39:55 AM

కాంకేర్‌లో 18 ఆయుధాలు అప్పగింత

చర్ల, అక్టోబర్ 26 (విజయక్రాంతి): చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు 18 ఆయుధాలతో లొంగిపోయారు. వీరందరూ కేష్కల్ డివిజన్ (నార్త్ సబ్ జోనల్ బ్యూరో) కుమారి కిస్కో డో ఏరియా కమిటీకి చెందినవారు. వీరిలో డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్ కూడా ఉన్నారు.

ఈ 21 మందిలో నలుగురు డివిజన్ వైస్ కమిటీ మెంబర్స్, తొమ్మిది మంది ఏరియా కమిటీ మెంబర్స్, 8 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 13 మంది మహిళా కేడర్లు, 8 మంది మగవారు ఉన్నారు. వారు అప్పగించిన ఆయు ధాల్లో మూడు ఏకే-47 రైఫిల్స్, నాలుగు ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్, రెండు ఇన్సాస్ రైఫిల్స్, ఆరు 303 రైఫిల్స్, రెండు సింగిల్-షాట్ రైఫిల్స్, ఒక బీజీఎల్ ఆయుధం ఉన్నాయి.

మరికొంతమంది లొంగిపోయేందుకు సిద్ధం

కాంకేర్ జిల్లాలో ఆదివారం ఉదయం దాదాపు 60 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి కామ్తేడా శిబిరానికి చేరుకు న్నారు. వీరిలో బెటాలియన్ కమాండర్ స్థాయి  మావోయిస్టు కూడా ఉన్నారు. వారి ని జగదల్‌పూర్ తీసుకువెళ్లే అవకాశం ఉంది. అదేవిధంగా బీజాపూర్ జిల్లాలోని భైరామ్‌గూడ్‌లో, మాడ్ డివిజన్ నుంచి 100 మం దికి పైగా మావోయిస్టులు, వారి నాయకుడు భూపతి నేతృత్వంలో లొంగిపోయే ఉద్దేశంతో వచ్చారని సమాచారం.