30-01-2026 02:01:32 AM
అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివద్ధి సాధ్యమవుతుందని, ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తోందని డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హై దరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివద్ధి విభాగంలో “గాలి నాణ్యత సూచీ, గాలి నాణ్యత నిర్వహణ”అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు భట్టి విక్రమార్క హాజరై మాట్లాడారు.
దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటి అని, హైదరాబాద్ ఐటీ, లైఫ్ సైన్సెస్, తయారీ, ఆవిష్కరణల కేంద్రం గా ఎదిగిందన్నారు. ఈ అభివద్ధి మనకు గర్వకారణమన్నారు. సుస్థిర అభివద్ధి ద్వారా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం అన్నారు. అదే సమయంలో జలాశయాల పునరుద్ధరణ, సహజ వనరుల సంరక్షణ, గాలి నాణ్యత మెరుగుదలపై కూడా తమ ప్ర భుత్వం పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందన్నారు. 2024 ‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్’ సహా ప్రపంచ స్థాయి అధ్యయనాలు ఈ సమస్య తీవ్రతను స్పష్టంగా చూపుతున్నాయని తెలిపారు. త్వరలో గాలి నాణ్యత డాష్ బోర్డులను ప్రారంభిస్తామన్నారు. రా ష్ర్టంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు అం దిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.