calender_icon.png 25 October, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్జేడీని ఓడిస్తేనే నిజమైన దీపావళి

25-10-2025 01:24:36 AM

  1. బీహార్‌లో మళ్లీ అటవిక పాలన రావొద్దు

ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకే ఓటు వేయాలి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

బక్సర్, సివాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

పాట్నా, అక్టోబర్ 24: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) హయాంలో బీహార్‌లో గూం డాయిజం రాజ్యమేలేదని, రౌడీషీటర్లు ప్రజలను భయభ్రాంతులను గురిచేసేవారని, రాష్ట్రంలో అటవిక పాలన (జంగల్‌రాజ్) సాగేదని, అలాంటి పాలన మళ్లి రావొద్దంటే ప్రజలు ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కేంద్ర మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. ఆర్జేడీని ఓడించిన రోజే బీహార్ ప్రజలకు నిజమైన దీపావళి అని పేర్కొన్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచా రంలో భాగంగా శుక్రవారం ఆయన బక్సర్, సివాన్‌లో పర్యటించారు. పలు సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. సివాన్ ప్రాంతంలో మాజీ ఎంపీ షహాబుద్దీన్ చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావని, 20 ఏళ్ల పాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించారు. షహాబుద్దీన్‌పై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 75 కేసులు ఉన్నాయని గుర్తుచేశారు.

అలాంటి కరుడుగట్టిన నేరస్తుడి కుమారుడు ఒసామా షహాబ్‌ను ఆర్జేడీ రఘునాథ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయిస్తున్నదని, దీని వెనుక ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ ఉద్దేశమేమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఇకపై 100 మంది షహాబుద్దీన్‌లు వచ్చినా బీహార్‌లో ఎన్డీయే కూటమి విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.

నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేంద్రం లో మోదీ సాయంతో రాష్ట్రాభివృద్ధికి బాట లు వేస్తారని తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రగతిని పరుగులు పెట్టిస్తుందని అన్నారు.