25-10-2025 01:21:22 AM
ఇస్లామాబాద్, అక్టోబర్ 24 : అఫ్గాన్ పాక్ బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్‌లో నిత్యావసరాల ధరలు చుక్కలనంటు తున్నాయి. కిలో టమాట ఏకంగా రూ.600 (పాకిస్థాన్ రూపాయల్లో) పలుకుతోంది. బోర్డర్ మూసివేతతో ఇరుదేశాల ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. పండ్లు, కూరగాయలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి.
రెండు దేశాల సరిహద్దులను అక్టో బర్ 11న మూసివేశారు. ఘర్షణలకు ముం దుతో పోలిస్తే పాక్‌లో టమాటా ధరలు ఐదు రెట్లు పెరిగాయి. అఫ్గాన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే ఆపిల్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు తెలిసింది. సాధారణంగా పాక్ సరిహద్దు నుంచి ఏటా ఇరు దేశాల మధ్య 2.3బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుంది. రెండు దేశాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో బోర్డర్లలో వాణిజ్య, రవాణా సదుపా యాలు పూర్తిగా నిలిపివేశామని కాబుల్‌లోని పాక్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ వెల్లడించారు.
దీని వల్ల రోజుకు ఇరువైపులా దాదా పు ఒక మిలియన్ డాలర్ల (దాదాపు 8కోట్లు) నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఆఫ్గాన్ నుంచి పాక్‌కు సరఫరా చేసే దాదాపు 5కంటైనర్లు పాడైనట్లు తెలిపారు. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5వేల కంటైనర్లు నిలిచిపో యాయని పాకిస్థాన్‌లోని ప్రధాన టో ర్ఖామ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద ఉన్న ఓ అధికారి పేర్కొన్నట్లు తెలిసింది.
మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాక్ ప్రజ లు లబోదిబోమంటున్నారు. సంక్షోభంపై ఇరు దేశాల మధ్య చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో సరిహద్దు వాణిజ్యం ఇంకా తెరు చుకోలేదు. రెండు దే శాల మధ్య శనివారం మరో మారు జరిగే చర్చలు సఫలం కావాలని ఇరు దేశాల ప్రజలు ఆశిస్తున్నారు.