08-05-2025 12:00:00 AM
భీమారం (చెన్నూర్), మే 7 (విజయక్రాం తి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభు త్వం ప్రవేశపెట్టిన భూ భారతి నూతన ఆర్. ఓ.ఆర్. చట్టంలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
బుధవారం భీమారం మండలం పోలంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని హెల్ప్ డెస్క్, మద్దికల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సులను సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20 వరకు కార్య చరణ ప్రకారంగా జిల్లాలో రెవెన్యూ సర్వీసులు నిర్వహించి అర్జీదారుల నుంచి భూ సమస్యల సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో నిర్ణీత తేదీలలో ఉదయం 9 నుంచి సాయం త్రం 4 వరకు సదస్సులు నిర్వహించి నిర్ణీత నమూనాలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు.
గ్రామ సభకు 2 రోజుల ముందే గ్రామాలలో ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తుస్తామని, నూతన చట్టంలో రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందని, రిజిస్ట్రేషన్, ముటేషన్ చేసేందుకు ముందు భూ ముల వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి, మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని, పెండింగ్ సాదా బైనామా దర ఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని, వారసత్వం గా వచ్చిన భూములకు విరాసత్ చేసే ముం దు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణ చేయ డం, సంబంధిత వారసులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.
దరఖాస్తుతో పాటు రిజిస్టర్డ్ దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు జతపరిచినట్లయితే పరిష్కరించేందుకు మరింత అవకాశం ఉంటుం దని తెలిపారు. దరఖాస్తుదారుల నుండి దరఖాస్తు స్వీకరించిన సమయంలో రశీదు జారీ చేయడంతో పాటు వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని తెలిపారు.
గ్రామ స్థాయిలోని సమ స్యలపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని, రైతులకు పట్టా భూమి, లావుని పట్టా, ఇతర రకాల భూములకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వ ఆదేశాలు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.