08-05-2025 12:00:00 AM
వ్యవసాయ శాస్త్రవేత్త ఉమా రెడ్డి
మహబూబాబాద్, మే 7 (విజయ క్రాంతి): సాగులో సేంద్రీయ పద్ధతులు పాటించడం వల్ల రైతులకు తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడి మేలైన పంట, గిట్టు బాటు ధర లభిస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఉమారెడ్డి అన్నారు. మహబూ బాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వరంగల్ విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు భూసార పరిరక్షణ కోసం పంట మార్పిడి విధానాన్ని పాటించాలన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న కార్యక్రమాలను వినియోగించుకుని సలహాలు సూచనలు పాటిస్తే వ్యవసా యంలో మరిన్ని లాభాలు గడించవచ్చని చెప్పారు. అసిస్టెంట్ డీన్ డాక్టర్ వెంకట్రెడ్డి, ప్రొఫెసర్లు రాజేంద్రప్రసాద్, గోపిక, ఏ ఈ ఓ భాస్కర్, రైతులు పాల్గొన్నారు.