07-05-2025 11:14:20 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): కోల్ బెల్ట్ ఏరియా రామకృష్ణాపూర్ స్థానిక ఠాగూర్ క్రీడా మైదానంలో ఈ నెల 10 నుండి 11 తేదీ వరకు ఆర్.ఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. టోర్నమెంట్‌కు సంబంధించిన బుధవారం గోడ పత్రికలను పట్టణ ఎస్సై రాజశేఖర్, పుర కమిషనర్ రాజు లు ఆవిష్కరించారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు గాండ్ల సమ్మయ్య, మిట్టపల్లి శ్రీనివాస్, క్రీడా మైదానం ఏరియా కోఆర్డినేటర్ శివ కృష్ణ, వసుధ ఆసుపత్రి డైరెక్టర్ ప్రశాంత్, ఆర్గనైజర్లు బెల్లం శ్రీనివాస్, కుమారస్వామి, దుబ్బా శ్రీనివాస్, రాజేశం, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.