calender_icon.png 31 January, 2026 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల్లో రాణించినప్పుడే గుర్తింపు

31-01-2026 12:00:00 AM

మునిపల్లి, జనవరి30 : చదువుతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా శుక్రవారం నాడు మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసికల్లాసంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తాయని అందువల్ల విద్యార్థులు చదువుతోపాటు క్రీడలను అలవాటుగా చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంజయ్య,మండల విద్యాధికారి భీంసింగ్, కంకోల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తుకారం స్థానిక జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సురభి చైతన్య, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.