calender_icon.png 31 January, 2026 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశానికి సేవలందించాలి

31-01-2026 06:36:22 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దేశ పౌరులు తమ వంతు సేవలు దేశాభివృద్ధికి అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ లో మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ (ఎంఈఎస్) అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఎస్ అధికారులు జిల్లాలో వాంకిడి మండలం బంబార, రెబ్బెన మండలం గోలేటి, సిర్పూర్-టి మండల కేంద్రం, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలలో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, విద్య, వైద్య, రవాణా రంగాలపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఈ అధ్యయనాలు దేశ సేవలో ఉపయోగపడతాయని కలెక్టర్ అన్నారు. అనంతరం అధికారులు జిల్లా కలెక్టర్‌కు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.