31-01-2026 06:43:23 PM
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటరు జాబితా వివరాలు సేకరించాలని, రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని సూచించారు.
జిల్లా కేంద్రంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత, అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో 678 మంది బూత్ స్థాయి అధికారులు, 68 మంది సూపర్‌వైజర్లు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు.