31-01-2026 06:33:21 PM
కనెక్టివిటీ లేని గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేసిండ్రు
దేవరకద్ర అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉంది
విలేకరుల సమావేశంలో ఎంపీ డీకే అరుణ
దేవరకద్ర: మున్సిపాలిటీ లను చేసి గత ప్రభుత్వం చేతులు తెలుపుకున్నదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. దేవరకద్ర లోని బిజెపి నాయకులు పవన్ కుమార్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేశారన్నారు. దేవరకద్ర నుంచి ఆ గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు సరిగ్గా లేవని, మున్సిపాలిటీలకు కేంద్రం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తేనే అభివృద్ధి అవుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వడం లేదని, ప్రజలు కట్టిన పన్నులు, కేంద్రం నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం.. మున్సిపాలిటీలకు పైసా ఇవ్వడం లేదని విమర్శించారు. రోడ్ల మరమ్మత్తులకు టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన.. కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయ్యిందని సీఎం చెబుతుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు హామీలు ఇచ్చి వెళ్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేశారా..? మున్సిపాలిటీలకు ప్రధానంగా కావలసినది పారిశుధ్యం,రోడ్లు,డ్రైనేజ్, విధి లైట్లు.. ఈ అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే అన్నారు.
ప్రణాళిక బద్దంగా మున్సిపాలిటీలు అభివృద్ధి చేసుకుందమని,2047 నాటికి వికసిత్ భారత్ గా ప్రపంచ దేశాల సరసన నిలవాలని మోదీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పథకాలు పెట్టీ మున్సిపాలిటీల అభివృద్ధి కి కృషి చేస్తుందన్నారు. దేవరకద్ర కొత్త మున్సిపాలిటీ కాబట్టి అమృత్ పథకం కింద నిధులు రాలేదని తెలిపారు. కొత్తకోట, భూత్పూర్ మున్సిపాలిటీలకు కేంద్రం నిధులు ఇచ్చిన.. రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు రాక.. అభివృద్ధి అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు. మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఉపయోగించుకోకపోతే ఎలా అభివృద్ధి జరుగుతుందని,
దేవరకద్ర కు ఆర్ఓబీ పూర్తి అయ్యాక.. స్థానికులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారని లిమిటెడ్ హైట్ సబ్ వేకు ప్రత్యేక చొరవతో మంజూరు చేయించడం జరిగిందని, ఎల్హెచ్ఎస్ కి ఫిబ్రవరిలో టెండర్లకు పిలుస్తారని,భూసేకరణ కు ప్రజలు సహకరిస్తే.. పనులు త్వరగా పూర్తి అవుతాయన్నారు. కొందరు తామే ఎల్హెచ్ఎస్ మంజూరు చేయించమని ప్రచారం చేసుకుంటురన్నారు. ఎవరు మంజూరు చేయించారు? అనేది ప్రజలకు తెలుసని, రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధి అనేది కూడా మరచి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
దేవరకద్ర మున్సిపాలిటీ వార్డులలో బీజేపీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాలని,ఎంపీగా మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తిగా సహాయ సహకారం అందిస్తానని, మరింత అభివృద్ధి చేసుకుందమన్నారు. బీజేపీ నీ ప్రజలు ఆశీర్వదించండి.. కేంద్రం ప్రభుత్వంతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు పవన్ కుమార్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.