31-01-2026 06:11:28 PM
రోడ్డు మార్గంలో జీబ్రా చారలు పాటిస్తే ప్రమాదాలు జరగవు
కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ అమీనముంతాజ్జహాన్
మహబూబ్ నగర్ (విజయ క్రాంతి): ప్రభుత్వ ఎస్టిఆర్ మహిళా డిగ్రీ అటానమస్ కళాశాలలో జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ జీబ్రా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ అమీనముంతాజ్జహాన్ మాట్లాడుతూ జీబ్రాలు ఆఫ్రికా ఖండానికి ప్రత్యేకమైన అడవి జంతువులు వాటి ప్రత్యేకమైన నలుపు-తెలుపు గీతలు పృకృతిలో ఒక అద్భుతమైన స్రుష్టిగా నిలుస్తాయి.
పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో జీబ్రాల పాత్ర ఎంతో కీలకం, అయితే అడవుల నాశనం, అక్రమ వేట, వాతావరణ మార్పుల కారణంగా జీబ్రాల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో జిబ్రాల సంరక్షణకు మనందరిలో అవ గాహన కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంటూ ఈ సందర్భంగా పర్యావరణ ప్రేమికులు, విద్యార్థులు, యువత జీబ్రా ల రక్షణకు ముందుకు రావాలని, అడవులను కాపాడాలని, వన్య ప్రాణుల సంరక్షణపై బాధ్యతగా వ్యవహరించాలని, జీబ్రా లను కాపాడితేనే ప్రక్రుతి సమతుల్యత నిలుస్తుంది ఇది మన అందరి భాద్యత అంటూ మాట్లాడారు.
కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. పద్మ అనురాధ మాట్లాడుతూ జీబ్రా శరీర వర్ణం అంత గంభీరంగా ఉన్నా తగు సమయాల్లో అస్పష్టంగా ఉండి రక్షణకు ఆస్కారం ఇస్తుంది. రోడ్ల అంచులా మలుపుల్లో రహదారి శాఖవారు తెలుపు నలుపు రంగులు వేసిన రాళ్లను పాతి ఉంచడం వలన అవి తొందరగా కనిపించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారిస్తాయి అంటూ మాట్లాడారు. ఐ.క్యూ.ఎ.సి. కో- ఆర్డినేటర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్. జె. శ్రీదేవి మాట్లాడుతూ అంతర్జాతీయ జీబ్రా దినోత్సవం మన గ్రహం మీద ఉన్న అద్భుతమైన జీవ వైవిద్యాన్ని, దానిని రక్షించాల్సిన మన భాద్యతను గుర్తు చేస్తుంది.
ఈ అందమైన చారల గుర్రాలు రాబోయే తరాలకు ఆప్రికన్ మైదానాల్లో ఉండేలా చూసుకుందమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉపన్యాస పోటీలలో గెలుపొందిన అఖిల, బి. జడ్.సి. యస్ ప్రథమ బహుమతి, మదిహా, బి. జడ్. సి. ఫైనల్ ఇయర్, ద్వితీయ బహుమతి, అఫీఫా. యం.జడ్.ఎ.ఎన్, సెకండ్ ఇయర్, తృతీయ బహుమతి గెలుచుకున్నారు, ఈ కార్యక్రమంలో జంతుశాస్త్ర అధ్యాపకులు జె. స్వాతి, బి.శ్రీలత, అదిబాతాజ్, డాక్టర్. సి.హెచ్. శివప్రసాద్, యం, వెంకటరమణ మూర్తి పాల్గొన్నారు.