calender_icon.png 31 January, 2026 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం

31-01-2026 06:13:40 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ లో శనివారం శ్రీవేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగింది. శ్రీవేణుగోపాలస్వామి ఆలయ బ్రహోత్సవాలలో భాగంగా ఆలయంలో ఉదయం సేవాకాలం, ప్రబోధకి ఆరగింపు, స్వామివారి గ్రామసేవ, శ్రీగోపాలస్వామి కళ్యాణ మహోత్సవం పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.

వందలాది మంది భక్తుల సమక్షంలో బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీవేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఈమహోత్సవం తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు చేరుకోవడంతో భక్తజనులతో ఆలయ ప్రాంగణం కేటకిటలాడింది. ఈ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు అంబారీపేట అప్పలాచార్యులు, మురళీకృష్ణ చార్యులు, వరదరాజు చార్యులు, రాంప్రసాద్ చార్యులు, ఏవిఎల్ ఎన్ చార్యులు, వేణుగోపాల చార్యులు, బుచ్చమా చార్యులు, శ్రీనివాస చార్యులు, రాఘవా చార్యులు, నారాయణ చార్యులు, బద్రి నారాయణ చార్యులు, రాజగోపాలచార్యులు, భక్తజనులు పాల్గొన్నారు.