31-01-2026 06:28:48 PM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని శనివారం దర్శించుకున్న ఇండియా నేపాల్ శ్రీలంక మాల్దీవ్స్ భూటాన్ తదితర దేశాల ప్రపంచ రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ రొ.కే పీ నగేష్ దంపతులు. ఈయనతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రోటరీ జిల్లా-3150 మాజీ గవర్నరు బూసిరెడ్డి శంకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ అధికారి సాయిబాబా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు నిర్వహించారు. గవర్నర్ వెంట స్థానిక రోటరీ నాయకులు డాక్టర్ మడిపెద్ది రమేష్ బాబు , సాయిరామ్ హనుమంతరావు సంపత్ తదితరులు పాల్గొన్నారు.