31-01-2026 06:16:19 PM
ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ శనివారం పూర్తి చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, నోడల్ అధికారులు శ్రీనివాస చారి, జగన్ మోహన్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, భారతి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.