31-01-2026 06:24:44 PM
గోదావరి హారతి నిర్వాహకులకు దిశా
నిర్దేశం చేస్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాచలం (విజయక్రాంతి): మాఘ పౌర్ణమి (వ్యాస పౌర్ణమి) ఆదివారం ఫిబ్రవరి 01వ తేదీన దివ్య క్షేత్రం భద్రాద్రి గోదావరి స్నాన ఘట్టాల వద్ద నిర్వహిస్తున్న గోదావరి హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం నాడు గోదావరి కరకట్టల దగ్గర నదీ హారతి నిర్వాహకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముక్కోటి ఏకాదశి పూర్తి అయిపోయిన తర్వాత ప్రతి ఆదివారం గోదావరి ఘాట్ లో అర్చక స్వాములు, భక్తుల సమక్షంలో నదిహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నందున భక్తుల నుంచి ప్రజలనుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు.
మాఘ పౌర్ణమి ఆదివారం నిర్వహించే గోదావరి హారతి కార్యక్రమాన్ని సాయంత్రం ఐదు గంటల నుండి 5:30 వరకు చిన్నారులతో మంచి భజన కార్యక్రమము మరియు భక్తి గీతాలతో భక్తులకు అలరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, అనంతరం అర్చక స్వాములు గోదావరి నది హారతి శ్రీ సీతారామ చంద్రులు వారి జపం చేసుకుంటూ ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య క్షేత్రంలో నదిహారతి కార్యక్రమం జరుగుతున్నందున భద్రాచలంలోని భక్తులే కాక జిల్లా వాసులు, ఆసక్తి ఉన్నవారు అందరూ నదిహారతి కార్యక్రమంలో పాల్గొనాలని, నది హారతి ముగిసిన వెంటనే భక్తులకు ప్రసాదాలు అందించడానికి దాతలు ముందుకు వస్తున్నందున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన అన్నారు.
అనంతరం నదిహారతి కార్యక్రమం నిర్వహించే విధానం గురించి నిర్వాహకులకు దిశా నిర్దేశం చేశారు. భక్తుల ప్రశంసలు పొందే విధంగా గోదావరి హారతి నిర్వహించాలని నిర్వాహకులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీ సర్పంచ్ పూనెం.కృష్ణ, గ్రామ పంచాయితీ ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం ee రవీందర్, పురోహితులు రామావఝల రవికుమార్, పవన్ కుమార్ శర్మ, అశోక్ కుమార్ శర్మ, సరస్వతి శిశు మందిర్ ఉపాధ్యాయులు, భద్రాద్రి క్లాత్ & రెడీమేడ్ అసోసియేషన్ సభ్యులు, భద్రాద్రి కా మహారాజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.