01-07-2025 12:50:11 AM
ములుగు,జూన్30(విజయక్రాంతి): మారుమూల గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహించడం అదృష్టంగా భావించాలని, ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ కాదని ఆరోగ్యరీత్యా విరమణని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి చిట్టిరెడ్డి రవీందర్‌రెడ్డి, ఏటూరునాగారం ఎంపీడీవో రాజ్యలక్ష్మి, వాజేడు డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ లు పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా వీడ్కోలు సమావేశం లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావులతో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ 61 ఏండ్లుగా పూర్తి చేసుకున్న అనంతరం కలెక్టర్ స్థాయి నుండి అటెండర్ స్థాయి వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ పొందాల్సి ఉంటుందని, పదవీ విరమణ పొందిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ కుటుంబ సభ్యుల తో ఉల్లాసంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. వివిధ జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, మండల అధికారులు,సిబ్బంది, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ములుగు, జూన్30(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.అదనపు కలెక్టర్లు,సిహెచ్. మహేందర్ జి, సంపత్ రావులు పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కరించాలని, ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో 85 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు 39,గృహ నిర్మాణ శాఖకు 16,ఉపాధి కల్పనకు 03,పెన్షన్ 06,ఇతర శాఖలకు సంబంధించినవి 21దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి, వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని, పరిష్కరించుటకు వీలుకాని సమస్యలను ఎందుకు పరిష్కరించబడవో దరఖాస్తు దారునికి వివరించే ప్రయత్నం చేయాలని,ప్రజావాణి దరఖాస్తుల పరిష్కరించిన వివరాలు దరఖాస్తుదారుడి మొబైల్ కి సమాచారం అందించేలా చూడాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.