01-07-2025 12:50:08 AM
రాచకొండ అడిషనల్ డీసీపీ వెంకటరమణ
ఘట్ కేసర్, జూన్ 30 : ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తప్పదని రాచకొండ కమిషనరేట్ మల్కాజిగిరి డివిజన్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ అన్నారు. ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ లో ఎస్‌ఐ గా విధులు నిర్వహిస్తున్న తోట మహేందర్ పదవి విరమణ సోమవారం సాయంత్రం జరిగింది. ఈకార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మహేందర్ దంపతులను శాలువ తో సత్కరించారు. ఈకార్యక్రమంలో మల్కాజిగిరి ఏసిపి చక్రపాణి, ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ పం దిరి పరశురాం, క్రైమ్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ లు ప్రభాకర్ రెడ్డి, సాయికుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.