calender_icon.png 11 September, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒప్పంద రద్దును పునఃసమీక్షించండి!

15-05-2025 12:04:34 AM

  1. సింధూ జలాలపై లేఖ రాసిన దాయాది
  2. సింధూ జలాలు నిలిపేస్తే పాక్‌లో పరిస్థితి దారుణంగా ఉంటుందని లేఖ

న్యూఢిల్లీ, మే 14: ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ రద్దు చేసింది. ఒప్పందం రద్దు తర్వాత తీవ్ర స్వరంతో హెచ్చరికలు చేసిన పాక్ యంత్రాంగం ఇప్పుడు రద్దును పునఃసమీక్షించమని కోరుతూ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్టు తెలుస్తోంది.

పాకిస్థాన్ జలవనరుల శాఖ భారత జల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు లేఖ రాసినట్టు సమాచారం. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసినట్టు విదేశాంగ శాఖ పాకిస్థాన్ జలవనరుల శాఖకు లేఖ ద్వారా తెలియజేసింది. ఈ ఒప్పందం ద్వారా సట్లెజ్, బియాస్, రావి నదుల నీటిని భారత్, సింధూ, జీలం, చినాబ్ నదుల నీళ్లను పాక్ ఉపయోగించుకుంటున్నాయి. ఈ అన్నీ నదులు కూడా భారత భూభాగం నుంచే ప్రవహిస్తున్నాయి.