calender_icon.png 11 September, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజాపై ఇజ్రాయెల్ వైమానికదాడులు

15-05-2025 12:00:00 AM

  1. ఘటనలో 48 మంది మృతి
  2. మళ్లీ రణరంగంగా మారిన పశ్చిమాసియా

న్యూఢిల్లీ, మే 14: ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇజ్రాయెల్ గాజాపై వరుస దాడులతో విరుచుకుపడిం ది. తాజాగా ఉత్తర గాజాలోని ఇండ్లపై మంగళవారం రాత్రి వైమానిక దాడులు చేసింది. ఈ భీకర దాడిలో 48 మంది పౌరులు మృతిచెందగా, అందులో 22 మంది చిన్నారులు ఉన్నారు. ఈ విషయాన్ని జబాలియా లోని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశా రు.

అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరువర్గాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం హమాస్ ఒక ఇజ్రాయెల్ బందీని విడుదల చేసిన అనంతరం ఈ దాడులు జరగడం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ పర్యటనలో ఉన్నప్పుడే ఇజ్రాయెల్ గాజా పై దాడులకు పాల్పడ టం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. గాజాలో తమ యుద్ధా న్ని ఆపేందుకు ఎలాంటి మార్గం లేదని స్పష్టం చే శారు. దీంతో యుద్ధ విరమణపై ఆశలు సన్నగిల్లా యి. హుతీలు ఇటీవల ఇజ్రాయెల్ పై దాడులకు పాల్పడటంపై నెతన్యా హు తీవ్రఆగ్రహం వ్యక్తంచేశారు. కచ్చితంగా హుతీలను ఎదురుదెబ్బ తీస్తామని, గతంలో ఐడీఎఫ్ చేసిన దాడులను వారు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.