calender_icon.png 7 September, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిర్గాపూర్ కస్తూర్బ గాంధీ బాలికల హాస్టల్ లో ఖాళీ పోస్టులకు ఆహ్వానం

06-09-2025 10:39:24 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బ గాంధీ హాస్టల్ లో మూడు ఖాళీ పోస్టులకు రాత్రి వచ్మెన్, అటెండర్, వంట పోస్టులకు దరఖాస్థులు ఆహ్వానమని ప్రిన్సిపాల్ సంతోషి కుమారి తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...అటెండర్, వచ్మెన్ పోస్టులకు 10వ తరగతి అర్హత అని వయసు 18 నుండి 45 సంవత్సరాల మహిళలు అర్హులని, వంట చెయ్యడానికి వంట మనిషి అనుభవం కల వారు ఉండాలని, వచ్మెన్ పోస్టుకు 10వ తరగతి చదివి, ఏదైనా సెక్యూరిటీ సంస్థ నుండి గుర్తింపు లభించి ఉండలన్నారు. ఈ పోస్టులకు మహిళలు ఈ నెల 10 తేదీ లోపు కస్తూరి గాంధీ బాలికల విద్యాలయంలో దరఖాస్థులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సంతోషి కుమారి తెలిపారు.