ఘనంగా రెడ్‌క్రాస్ దినోత్సవం
09-05-2024 02:26 AM
వనపర్తి, మే 8 (విజయక్రాంతి): రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ జయంతిని పురస్కరించుకొని బుధవారం ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి గంట కవిత పాల్గొన్నారు. మొదట హెన్రీ డ్యూనాంట్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రెడ్‌క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.






