calender_icon.png 3 July, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేలిన ఫ్రిజ్.. పూర్తిగా దగ్ధమైన ఇల్లు

03-07-2025 11:36:02 AM

హైదరాబాద్: సనత్‌నగర్‌లోని రాజరాజేశ్వరి(Rajarajeshwari Nagar) నగర్‌లోని ఒక నివాసంలో గురువారం రిఫ్రిజిరేటర్ పేలడంతో(Refrigerator Explodes) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency) నుండి అగ్నిమాపక దళం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav) బాధిత కుటుంబాన్ని పరామర్శించి సహాయాన్ని అందించారు.