calender_icon.png 4 July, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోతాదుకు మించి ఎరువులు వినియోగించొద్దు

03-07-2025 05:07:43 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): అధిక మోతాదులో ఎరువుల వినియోగం వల్ల భూమికి నష్టమే తప్ప, రైతుకు ఎటువంటి లాభం ఉండదని, మోతాదు ప్రకారమే ఎరువులను వినియోగించాలని మహబూబాబాద్ ఏడిఏ అజ్మీరా శ్రీనివాసరావు(ADA Ajmira Srinivasa Rao) అన్నారు. కేసముద్రం మండలంలోని వెంకటగిరి, చంద్రు తండా, మహమూద్ పట్నం, కేసముద్రం పరిధిలో వానాకాలంలో సాగుచేసిన పంటలను ఏవో వెంకన్నతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రసాయన ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని అధికం చేయాలని, సాధారణ యూరియాకు బదులు నానో యూరియాను వినియోగించాలని, వరి పంట సాగుకు ముందు పొలం మడిలో పచ్చిరొట్ట ఎరువులు, పశువుల పెంట, చెరువు మట్టి పోయడం ద్వారా భూమికి బలం చేకూరి పంట దిగుబడి అధికంగా వస్తుందని చెప్పారు. ఈ సీజన్లో పంటలకు ఆశించే చీడపీడలపై అవగాహన కల్పించారు. మూస పద్ధతిలో సాగు విధానాన్ని విడనాడాలని, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకోవాలని కోరారు. వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంలో రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లు శ్రీనివాస్, రాజేందర్, రవి వర్మ రైతులు పాల్గొన్నారు.