calender_icon.png 4 July, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుదాఘాతంతో హెల్పర్ మృతి

03-07-2025 05:14:03 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): విద్యుదాఘాతానికి గురై మహబూబాబాద్ పట్టణ పరిధిలోని ఈదుల పూసపల్లిలో హెల్పర్ గంట్ల కర్ణాకర్ రెడ్డి(46) మరణించాడు. కర్ణాకర్ రెడ్డి తన పొలం వద్ద వరి నారు పోయడానికి కరెంట్ మోటర్ ఆన్ చేయడానికి వెళ్ళగా నడవకపోవడంతో స్టార్టర్ సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్లు మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ దీపిక(SI Deepika) తెలిపారు. ఘటనపై మృతుడి భార్య ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.