calender_icon.png 7 July, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండస్ట్రీలో రిలేషన్‌షిప్స్ అలాగే ఉంటాయి!

07-07-2025 12:56:32 AM

‘సినిమా సినిమాకూ టీమ్ మారుతూ ఉంటుంది. పరిశ్రమ కూడా కొత్తదనాన్నే కోరుకుంటుంది. ఇండస్ట్రీలో రిలేషన్‌షిప్స్ కూడా అలాగే ఉంటాయి’ అని చెబుతోంది స్టార్ హీరోయిన్ నయనతార. నయన్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట ఆసక్తిగా మారాయి. “ఫ్రెండ్‌షిప్ అనేది జస్ట్ వర్డ్ మాత్రమే కాదు.. అదొక వరల్డ్. మన వరల్డ్ గురించి తెలిసినవారు ఈ లోకం ఇద్దరో ముగ్గురో ఉంటారు. అలాంటి వాళ్లనే ఫ్రెండ్స్ అని పిలుస్తా.

సినిమా పరిశ్రమ కూడా కొత్తదనాన్నే కోరుకుంటుంది. ఇండస్ట్రీలో రిలేషన్‌షిప్స్ అలాగే ఉంటాయి. సినిమా సినిమాకూ టీమ్ మారుతూ ఉంటుంది. ఓ సినిమాకు కలిసినవారు, మరో సెట్‌లో కనిపించరు. రిపీటేషన్స్ అరుదుగా ఉంటాయి. కాబట్టి ఏ రోజుకారోజు కొత్త పరిచయాలు ఉంటాయి. సెట్లో కలిసి పనిచేసేటప్పుడు పర్సనల్స్ షేర్ చేసుకునే స్పేస్ ఉండదు. అందరి దృష్టి సీన్స్, షూటింగ్ మీదే ఉంటుంది.

ఒకరి గురించి ఒకరికి అన్నీ తెలిసి.. అన్నివేళలా ఒకరికొకరు సపోర్ట్‌గా నిలబడగలరనే నమ్మకం ఉన్నప్పుడే దాన్ని ఫ్రెండ్‌షిప్ అనాలి” అని తెలిపింది. నయనతార ప్రస్తుతం తెలుగులో ‘మెగా157’ కోసం పనిచేస్తున్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నయన్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా తమిళం, మలయాళంలోనూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.