07-07-2025 12:55:07 AM
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఓ అందమైన ప్రేమకథతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతాఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవ హిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది.
ప్రస్తుతం హైద రాబాద్‌లో నాయికానాయకులు రష్మిక, దీక్షిత్ శెట్టిపై పాట చిత్రీకరిస్తున్నారు. టాకీ పార్ట్ దాదాపు పూర్తయ్యింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ చిత్రంలోని తొలిపాటను త్వరలో విడుదల చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి సంగీ తం: హేషమ్ అబ్దుల్ వాహబ్; సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్.