16 April, 2026 | 9:01 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

రైతు భరోసా నిధులు విడుదల చేయండి

20-06-2025 01:02 AM

మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు వినతి పత్రాన్ని అందజేసిన కాట శ్రీనివాస్ గౌడ్ 

పటాన్ చెరు, జూన్ 19 :పటాన్ చెరు నియోజకవర్గంలోని పటాన్ చెరు, జిన్నారం, అమీన్ పూర్, రామచంద్రాపురం మండలాలకు రావాల్సిన రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జీ కాట శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కోరారు. ఈమేరకు గురువారం  పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి కాట శ్రీనివాస్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో  కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

అంతకు ముందు జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డె క్రిష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన మంత్రులు త్వరలోనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.