31-08-2024 12:48:48 AM
దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన ‘విడుదల1’ ప్రేక్షకాదరణ పొందినప్పటి నుంచి సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో ‘విడుదల2’ రూపొందింది. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. భవానీశ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఇందులో భాగమయ్యారు. ఇళయరాజా సంగీతం ఈ మూవీకి మరో ఆకర్షణ కానుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.