calender_icon.png 13 July, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలితో దర్జాగా.. కుబేరతో సరదాగా...

30-08-2024 12:00:00 AM

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున అక్కినేని పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న రెండు సినిమాల నుంచి గురువారం విడుద లైన విభిన్నమైన లుక్ పోస్టర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. తమిళ స్టార్ హీరో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. దీన్నుంచి సరికొత్త పోస్టర్‌ను నాగార్జున బర్త్‌డే సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్‌లో ఆయన కొత్త లుక్‌లో, స్టైలిష్‌గా ఎదురుగా ఉన్నవారిని ఆప్యాయంగా పలకరిస్తూ కనిపించారు.

సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్న ఈ సినిమా బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలి’లో కూడా నాగార్జున నటిస్తున్నారు. ఈ మూవీలోని ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఆ చిత్రబృందం కూడా ఓ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ‘సిమోన్’గా నాగార్జున లుక్ ఆకట్టుకుంటోంది. అటు ‘కూలి’ పోస్టర్‌తో దర్జా లుక్ ఇచ్చిన నాగ్.. ఇటు ‘కుబేర’ పోస్టర్‌తో సరదా పంచారు.