15-09-2025 11:24:51 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లి ఆదివారం అక్రమంగా ధాన్యం రవాణా చేస్తుండగా గరిడేపల్లి పోలీసులు పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న ధాన్యం వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. విషయం సివిల్ సప్లై అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. సివిల్ సప్లై అధికారులు గరిడేపల్లి కి చేరుకుని లారీలో ఉన్న ధాన్యం బస్తాలు పరిశీలించారు. వాటిలో ప్రభుత్వ సంచులలో ధాన్యాన్ని కొల్హాపూర్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని మండపేటకు తరలిస్తున్నట్టుగా గుర్తించి పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అక్రమ ధాన్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్ఐ చలి కంటి నరేష్ తెలిపారు.