calender_icon.png 16 September, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికలాంగులకు పెన్షన్ పెంచాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తహసిల్దార్ ఆఫీస్ ముట్టడి

15-09-2025 11:29:20 PM

పటాన్చెరు,(విజయక్రాంతి): వికలాంగులకు పెన్షన్ పెంచాలని కోరుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా వచ్చి తాసిల్దార్ ఆఫీస్ ముట్టడి చేసి తాసిల్దార్ కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా టీఎండీఏ రాష్ట్ర నాయకులు మడపతి రవికుమార్, ఎంఎస్పీ పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జ్ పట్లోలా వెంకటేష్ మాట్లాడుతు వికలాంగులకు పింఛన్లు పెంచుతామని ఎలక్షన్లో అన్ని పార్టీలు హామీ ఇచ్చి ఇప్పుడు వికలాంగులకు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  మాట ఇచ్చిన ప్రకారం అన్ని పార్టీలు మద్దతు పలికి వికలాంగులకు పెంఛన్లు పెంచే విధంగా చూడాలని లేని పక్షంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు.