calender_icon.png 16 September, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ షాక్ తో కౌలు రైతు మృతి

15-09-2025 11:06:37 PM

గాంధారి,(విజయక్రాంతి): గాంధారి మండలం మోదెల్లి గ్రామానికి చెందిన కర్రోల సాయిలు (57) అనే కౌలు రైతు కరెంట్ షాక్ తో మృతి చెందినట్లు గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు అయినా తెలిపిన కథనం ప్రకారం మోదేల్లి  గ్రామానికి చెందిన కాగుల మొగులయ్య అనే రైతుకు చెందిన పొలాన్ని కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేస్తున్నాడు. దీనిలో భాగంగానే సోమవారం రోజున తమ వరి పొలంలో కలుపు తీయడానికి భార్యాభర్తలు కలిసి వెళ్లగా సాయిలు పంటకు నీరు పెట్టడానికి స్టార్టర్ ముట్టగా విద్యుత్ ప్రవాహం కావడంతో కరెంట్ షాక్ తగిలి సాయిలు సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు ఆయన తెలిపారు. భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.