15-09-2025 11:16:32 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లి తహసిల్దార్ కార్యాలయంలో పింఛన్లు పెంచాలంటూ సోమవారం ధర్నా నిర్వహించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్,ఎం.ఎస్.పి, వి.హెచ్.పి.ఎస్, ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ప్రకారం పింఛన్లు పెంచాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినప్పటికీ పింఛన్లు పెంచడం లేదని వారు ఆరోపించారు.వికలాంగులకు 6000 వృద్ధులు వితంతువులకు 4000 రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పి ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పింఛన్లు పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు కోరారు.అనంతరం తహసిల్దార్ బండ కవితకు వినత పత్రం అందజేశారు.