calender_icon.png 16 September, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించాలి

15-09-2025 10:57:08 PM

మందమర్రి,(విజయక్రాంతి): 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించాలని కార్పొరేట్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్, కార్పొరేట్ టార్గెట్ కమిటీ కన్వీనర్ ఏ మనోహర్ అన్నారు. ఏరియాలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనపై టార్గెట్ కమిటీ సభ్యులతో కలిసి సోమవారం ఆయన ఏరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియాలో ప్రతి సంవత్సరం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం జరుగుతుందని, 2026 - 27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిని ఏరియాలో అధిగమించాలని సూచించారు.

ఏరియా లోని వివిధ గనుల్లో సాదించాల్సిన బొగ్గు ఉత్పత్తి, ఓబి తొలగింపు లక్ష్యాలను కార్పొరేట్ టార్గెట్ కమిటీ నిర్ణయిస్తుందని కమిటీ నిర్ణయం మేరకు ఏరియా అధికారులు ఉద్యోగులు సమిష్టిగా కృషి చేసి లక్ష్యాలను అధిగమించాలన్నారు. అనంతరం 2026-27 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను, నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాదించేందుకు అవసరమ య్యే యంత్రాలు, పని స్థలాలు, కావలసిన పరికరాలు కమిటీ సభ్యులు కుణ్ణంగా చర్చించారు. అంతే కాకుండా బొగ్గు ఉత్పత్తికి అవసరమైన భూసేకరణ, దాని కోసం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం మొదలగు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.అనంతరం ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ ఏరియా లోని భూగర్భ, ఉపరితల గనులలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని  సాధిస్తాయని ఆయన స్పష్టం చేశారు.