15-09-2025 11:21:56 PM
మిడ్జిల్: స్వచ్ఛంద సంస్థలు సమాజానికి అందిస్తున్న సేవలు విశేషమైనవని జిల్లా సెక్రెటరీ లీగల్ సర్వీస్ అథారిటీ ఇందిర అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంవీఎస్ ఫంక్షన్ హాల్ లో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు మెన్సులేషన్ మరియు విద్యార్థులకు వ్యక్తిగత పరిశుద్ధతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సెక్రెటరీ లీగల్ సర్వీస్ అథారిటీ ఇందిరా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోక్స్ చట్టంపై విద్యార్థులు ఎలా ఉండాలని వారికి అవగాహన కల్పించారు. విద్యార్థులు సమాజంలో దీనికి భయపడకుండా ఎటువంటి వాటికి లొంగకుండా మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా గొప్ప స్థాయిలో ఎదగాలని తెలియజేశారు. ఎవరైనా పురుషులు వేధించినట్లయితే సంబంధిత పోలీస్ స్టేషన్ కు తెలియజేసినచో వారు చట్టపరమైన చర్యలు తీసుకొని వాటిని కఠినంగా జరుగుతుందని విద్యార్థులకు తెలియజేశారు.