calender_icon.png 16 September, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి దుర్మరణం

15-09-2025 11:12:23 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): వరంగల్ మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల్లో సోమవారం సాయంత్రం నెక్కొండ మండల పరిధిలో రక్మి తండా వద్ద ద్విచక్ర వాహనాలు ఢీకొని నరసింహుల పేట మండలం జయపురం పంచాయతీ కార్యదర్శి కుర్ర వెంకటరామ్ (55) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. నెక్కొండ ఎస్ ఐ మహేందర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శి వెంకట్రామ్ జయపురంలో విధులు నిర్వహించుకుని యాక్టివా వాహనంపై స్వగ్రామమైన నెక్కొండకు వస్తుండగా రక్మితం వద్ద రావణ పోయిన శివ శంకర ప్రసాద్ అనే వ్యక్తి అతివేగంగా పల్సర్ వాహనంపై వస్తు వెంకట్ రామ్ యాక్టివాను ఢీకొట్టాడని, దీనితో తీవ్ర గాయాలైన వెంకట్ రామ్ సంఘటనస్థలిలోనే చనిపోయాడు అని చెప్పారు. మృతుడి కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.