calender_icon.png 16 September, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై ఐదుగురి అరెస్ట్

15-09-2025 11:10:00 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ గ్రామంలోని శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న పలువురిని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర పోలీసు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పలువురిని పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై తెలియజేస్తూ గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో రహస్యంగా పేకాట ఆడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించామని తెలిపారు.

ఈ క్రమంలో కాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకొని వారి వద్ద నుంచి రూ.11,420 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మండలంలోని గ్రామాలలో పేకాట మట్కా గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. దురలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. ఇలాంటి ఆటలు ఆడి, కుటుంబాలను రోడ్డున పడేయోద్దని ఉద్బోదించారు.