calender_icon.png 3 August, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్తక సంఘం నూతన కమిటీ ఎన్నిక

03-08-2025 12:22:55 AM

అధ్యక్షులు రఘు, ప్రధాన కార్యదర్శి పాలకూర్ల యాదయ్య ఏకగ్రీవం

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): నారాయణపురం మండల  కేంద్రంలో వర్తక సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా వంగరి రఘు, ప్రధాన కార్యదర్శిగా పాలకుర్ల యాదయ్యను ఎన్నుకున్నారు. కమిటీ ఉపాధ్యక్షులుగా శికిల మెట్ల వెంకటేశం,కోశాధికారిగా ఇడుకుల్ల సురక్షితం, సహాయ కార్యదర్శిగా తెలంగాణ బిక్షం, కార్యవర్గ సభ్యులుగా రాసాల యాదయ్య, ఇడుకుల్ల ప్రేమ్ చందర్, ఉప్పల వెంకటేష్, చిలువేరు శంకర్ చిలువేరు, రమేష్, గౌరవ అధ్యక్షులుగా మురారిశెట్టి వెంకటయ్య, గౌరవ సలహాదారులుగా మొగుదాల సత్తయ్య, చిలువేరు అంజయ్య, చిలువేరు బిక్షంను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ కమిటీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని తమ ఎన్నికకు సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.