06-08-2025 01:41:53 AM
- బీజేపీ పాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకు ఒక న్యాయం
- తెలంగాణ రాష్ట్రానికి ఒక న్యాయమా?: సీపీఎం
ముషీరాబాద్, ఆగస్టు 5(విజయక్రాంతి): బీసీలకు అన్యాయం చేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని బీసీల 42 శాతం రిజర్వే షన్ అమలుకు బీజేపీ ప్రభుత్వం మత చిచ్చు పెట్టడం మానుకోవాలని, సామాజిక, ఆర్థిక వెనుకబాటు తనాన్ని గుర్తించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, ఎస్. వీరయ్య, సభాధ్యక్షులు జ్యోతి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కు పార్లమెంట్ లో చట్టం చేయాలని, సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ వద్ద మంగళవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతం ముసుగులో బిజెపి సామాజిక న్యాయం కు తూట్లు పొడుస్తుందని, అందుకు బీసీలకు అందాల్సిన 42 శాతం రిజర్వేషన్ అమలు పట్ల ఆడుతున్న నాటకాని తెలంగాణ ప్రజానీకం ఎండగట్టాలన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా అని బీజేపీని ప్రశ్నించారు.ఈ రిజర్వేషన్ పట్ల పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్. తద్వారా బీసీల పట్ల ఏ పార్టీ తీరు.. ఏ రంగో ..అప్పుడే అసలు రంగు బయటపడుతుందన్నారు. మతానికి రిజర్వేషన్ కి సంబంధం లేదని, బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటే బీసీ కమిషన్ ఏర్పాటు, అందుకు అనుకూలంగా విచారణ జరపాలని రాజ్యాంగం కూడా చెబుతుందన్నారు. సామాజికంగా,ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబాటు ప్రాతిపదికంగా రిజర్వేషన్లు కల్పిం చాలన్న ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు అదే విధంగా అనేక సందర్భాల్లో హైకోర్టు కూడా చెప్పిందన్నారు.
ఈ మాత్రం సోయి తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కు ఎందుకు లేదని, ముస్లింలను ఈ బీసీ రిజర్వేషన్ ల నుండి తొలగిస్తే రిజర్వేషన్లు అమలు పరుస్తామని సమర్థించే మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంటే బిజెపికి అర్ధరాత్రి నిద్రలేపిన..మతం తప్ప, ప్రజల అభివృద్ధి కానీ మరొకటి కనిపించే పరిస్థితి లేదన్నారు. పేద ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెట్టడం తప్ప ఇంకొక దారి, మార్గం లేదని విమర్శించారు.
అదేవిధంగా మతం పేరు ముడిపెట్టి బీసీల 42 శాతం రిజర్వేషన్ లలో చిచ్చు పెడుతున్నారని, ప్రజలు ప్రశాంతంగా ప్రశాంతంగా బ్రతకడం బిజెపికి ఇష్టం లేదని విమర్శించారు. ఏ రోజైతే సమాజంలో ప్రజలు ప్రశాంతంగాబ్రతకగలుగుతారో ఆరోజు బిజెపికి పుట్టగతులు ఉండవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కేంద్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు టీ. సాగర్, బండారు రవికుమార్, పి.ఆశయ్య, అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి, రమణ, పగడాల యాద య్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.