06-08-2025 01:41:16 AM
ఖమ్మం, ఆగస్టు 5 (విజయక్రాంతి): ఎన్నికల ముందు కేసీఆర్ దోచుకున్నారని తాము చెప్పామని, 15 నెలల విచారణ తర్వాత జస్టి స్ పీసీ ఘోష్ 665 పేజీల నివేదకతో అది నిజమంటూ తీర్పు ఇచ్చిందని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలంలో మంగళశారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు.
అక్రమంగా దోచుకున్న డబ్బు మళ్లీ ఖర్చు పెట్టడానికి మీ దగ్గరకు వస్తారని, ఆ డబ్బు తీసుకుని బీఆర్‌ఎస్‌కు రెండు చెంప లు చెళ్లుమనిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రెండుసార్లు మాయమాటలతో అధి కారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ను ప్రజలు మూడోసారి చెంపచెల్లుమనిపించారు అని మంత్రి విమర్శించారు. కాగా గ్రామంలోని రెండు చోట్ల రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రేషన్‌కార్డులు, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. తిరుమలా యపాలెం మండల అభివృద్ధికి ఇప్పటివరకు రూ.77.50 కోట్లు కేటాయించినట్టు వె ల్లడించారు. రాష్ర్టవ్యాప్తంగా అరులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరూ అభద్రతకు గురికావద్దని భరోసా ఇచ్చారు. రాబో యే ఎన్నికల్లో ప్రజల దీవెనలు ఇందిరమ్మ ప్రభుత్వానికి లభించాలన్నారు.