06-08-2025 01:42:57 AM
ధర్నాకు ఉద్యోగ జేఏసీ నేతలు సంఘీభావం
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్ దేశానికి మార్గదర్శకమని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు అన్నారు. బిల్‌కు రాష్ర్టపతి ఆమోదం కోసం ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి వారు మద్దతు తెలిపారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం బుధవారం చేపడుతు న్న ధర్నాలో తాము భాగస్వామ్యం అవుతున్నామని ప్రకటించారు.
ఈక్రమంలోనే మం గళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్న వారు.. మంత్రి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీ బిల్లును రాష్ర్టపతి ఆమోదించేలా కేంద్రం చొరవ చూపాలని కోరారు.
రాష్ర్ట జనాభాలో 56.33 శాతంగా ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి, స్థాని క సంస్థలలో 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించడం సహజ న్యాయమని, అవకాశాల స మానతలో అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల కు అందుతాయన్నారు. కార్యక్రమంలో ఉ ద్యోగ సంఘాల నేతలు ఏనుగుల సత్యనారాయణ, నర్సింహ రెడ్డి, నజీర్, యాదగిరి, శ్రీకాంత్, రాజీవ్ రెడ్డి, ఖాజా పాల్గొన్నారు.