జైలు నుంచి పరారైన రిమాండ్ ఖైదీ.. నందిమల్లలో ప్రత్యక్షం..
విషద్రవం తాగి ఆస్పత్రిలో చేరిక
ఆత్మకూర్, జులై 6: మహబూబ్నగర్ జైలు నుంచి సోమవారం ఉదయం పరారైన అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన రిమాండ్ ఖైదీ కిషోర్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం తన గ్రామ సమీపంలో ప్రత్యక్షమయ్యాడు. ఫోక్సో కేసులో రిమాండ్లో ఉన్న అతడు గ్రామ శివారులోని తమ వ్యవసాయ పొలం వద్ద నానో యూరియా ద్రవాన్ని తాగినట్లు స్థానిక రైతులు గుర్తించారు. వెంటనే అతడిని బ్పై ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, సమాచారం అందుకున్న సీఐ శివకుమార్, ఎస్త్స్ర స్వాతి అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్త్స్ర స్వాతి మాట్లాడుతూ, కిషోర్ కుమార్ రెడ్డి ఇంకా రిమాండ్లోనే ఉన్నాడని, కేసు విచారణ కొనసాగుతున్నందున శిక్ష ఖరారు కాలేదని తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న జిల్లా జైలు అధికారులు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






