రైల్వే వంతెన పనుల్లో భాగంగా విద్యుత్ తీగల తొలగింపు
ఘట్ కేసర్, జూన్ 9 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో రైల్వే వంతెన పనుల్లో భాగంగా పాత కల్కి హాస్పటల్ దగ్గర వేస్తున్న స్లాబ్ కి విద్యుత్ తీగలు అడ్డు రావడంతో కాంట్రాక్టర్ సత్తిరెడ్డి మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ కు తెలపడంతో మంగళవా రం విద్యుత్ తీగలు మరమ్మత్తుల చేయించడం జరిగింది. కాంట్రాక్టర్ సత్తి రెడ్డి తెలిపిన విధంగా మీకు ప్రభుత్వం నుండి రావలసిన నిధులు కూడా విడుదల చేయించాం, అలాగే విద్యుత్ తీగలు అడ్డొస్తున్నాయి అని తెలుపడంతో విద్యుత్ అధికారులకు తెలిపి తీసివేయించడం జరిగింది.
ముందు ముందు మీకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని మాజీ సర్పంచ్ యాదగిరియాదవ్ కాంట్రాక్టర్ కు తెలిపారు. మీరు మాకు చెప్పిన విధంగా డే అండ్ నైట్ పనులు చేసి వేగవంతంగా రైల్వే వంతెన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కాంట్రాక్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు రామ్మోహన్, నాగభూషణంచారి, శ్రీనివాస్ గౌడ్, శివరాత్రి సురేష్, తన్నీరు హరీష్, రామకృష్ణ, శివశంకర్, విద్యుత్ కాంట్రాక్టర్ మహంకాళి నవీన్ పాల్గొన్నారు.






