27 August, 2026 | 1:38 AM

టెస్టుల్లో నెం.1 బౌలర్‌గా స్టార్క్

27-08-2026 12:34 AM

అగ్రస్థానం కోల్పోయిన బుమ్రా 

దుబాయి, ఆగస్టు 26: ఐసీసీ పురుషుల తాజా టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Australian star pacer Mitchell Starc) 872 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా, సుదీర్ఘకాలం టాప్లో ఉన్న టీమిండియా పేసర్ జస్ప్రీత్ బు మ్రా 862 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.

బంగ్లాదేశ్‌పై జరిగిన టెస్ట్ సిరీస్‌లో 10 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా స్టార్క్ తన 15 ఏళ్ల కెరీర్లో తొలిసారి ఈ ఘనత సాధించాడు. మరోవైపు గాయం కారణంగా శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు  దూరం కావడంతో బుమ్రా తన టాప్ ప్లేస్ కోల్పోవాల్సి వచ్చింది. 2024 ఫిబ్రవరిలో తొలిసారి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న బుమ్రా.. దాదాపు రెండేళ్లుగా అదే స్థానం లో కొనసాగుతూ వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ర్యాంకింగ్స్లో దూసుకెళ్లాడు. మెకే టెస్టులో ఆరు వికెట్లు తీసి న కమిన్స్ 841 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరాడు.

ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ రెండు స్థానాలు ఎగబాకి తిరిగి టాప్-10లోకి వచ్చాడు. ఇక టెస్ట్ బౌలింగ్ టాప్-10 జాబితాలో ఆస్ట్రేలియా నుండి ఏకంగా ఐదుగురు బౌలర్లు చోటు దక్కించుకున్నారు. భారత్ నుండి బుమ్రా మినహా మరెవరూ టాప్-10లో లేరు. మహమ్మద్ సిరాజ్ 18వ స్థానంలో, రవీంద్ర జడేజా 19వ స్థానంలో ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో టాప్ స్థానాల్లో పెద్దగా మార్పులు లేవు. ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్ నంబర్-1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత వికెట్ కీపర్, బ్యాట ర్ రిషభ్ పంత్ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి 711 పాయింట్లతో శుభ్‌మన్ గిల్‌తో కలిసి సంయుక్తంగా ఏడో ర్యాంక్‌కు చేరాడు.