15-11-2025 12:00:00 AM
సిద్దిపేట క్రైం, నవంబర్ 14 : పెందోట సాహిత్య పురస్కారాలు2025, బాల కథల పోటీ2025 బహుమతుల ప్రధాన సభకు సంబంధించిన కరపత్రాన్ని పెందోట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ నెల 16న ప్రెస్ క్లబ్లో పెంధోటి సాహిత్య పురస్కారాల సభ ఉంటుందని తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా కవి నలవోలు నర్సింహారెడ్డి, పుస్తక ఆవిష్కరణకు డాక్టర్ గోపాల సుదర్శన్ హాజరవుతారని చెప్పారు.
కార్యక్రమాన్ని శ్రీవాణి సాహిత్య పరిషత్, పెందోట బాల సాహిత్య పీఠం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. కరపత్ర ఆవిష్కరణలో అడ్వకేట్ రాజలింగం, కవి నార్లపురం రాములు, ఆనందచారి, సిద్ది రాములు పాల్గొన్నారు