21-05-2025 12:00:00 AM
తొలగింపులు పరిశీలించిన ఎస్పీ అఖిల్, ఆర్డీవో
ట్రాఫిక్ సమస్యకు చెక్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, మే 20 (విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలోని రహదారులపై, ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణల తొలగింపు లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎన్నో ఏళ్లుగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు భారీ పోలీసు బందోబస్తు మధ్య ము న్సిపల్ సిబ్బంది మంగళవారం ఆక్రమణలను తొలగించారు.
పట్టణంలోని గాంధీ చౌక్ అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్‌తో పాటు ప్రధాన రోడ్లపై తోపుడుబండ్లు, ఫుట్‌పాత్‌ల పై వ్యాపారస్తులు తమ సామాగ్రిని ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేయడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.
దీంతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. వ్యాపారస్తులతో సుమారు 200 తోపుడు బండ్ల వ్యాపారస్తులతో పలుమార్లు సమావే శం నిర్వహించి వారికి ప్రత్యామ్నాయంగా గణేష్ టాకీస్ ఖాళీ స్థలాన్ని కేటా యించి, రోడ్లపై ఉన్న తోపుడు బండ్లను తొలగించారు.
ఈ క్రమంలో వీధి వ్యాపారులు తమ ఉపాధి కోల్పోతున్నామని మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
ఎన్నోఏళ్లుగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగిం పు ప్రక్రియను ఎస్పీ అఖిల్ మహాజన్, ఆర్డీఓ వినోద్ కుమార్ పరిశీలించారు. డీఎస్పీ జీవ న్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు దగ్గరుం డి సిబ్బందితో ఆక్రమణలను తొలగించారు.
మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే...
తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆదిలాబాద్ లోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిలబెట్టుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్ల రోడ్లపై ఉన్న తోపుడు బండ్లను తొలగించడంతో ప్రజల వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే పరిష్కరించలేని ట్రాఫిక్ సమస్య ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిష్కరించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అధికారులతో కలిసి పాయిల్ శంకర్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. దీంతో అధికారులతో పలుమార్లు చర్చించి ప్రజల కు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడంలో ఎమ్మెల్యే సక్సెస్ అయ్యారు.